Saturday, 24 January 2026 02:15:55 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ

Date : 13 December 2025 07:53 PM Views : 175

Studio18 News - జాతీయం / : సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్న మమత స్టేడియంలో పరిస్థితి చూసి తాను వెనుదిరిగానన్న మమతా బెనర్జీ మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి, క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా ఒక ప్రకటన చేశారు. మెస్సీతో కొందరు నాయకులు ఫొటోలు దిగుతూ సమయం వృథా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి, కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మెస్సీని చూసేందుకు వచ్చిన వేలాదిమంది క్రీడాభిమానులతో కలిసి తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి స్టేడియానికి బయలుదేరానని తెలిపారు. అయితే, అక్కడి పరిస్థితిని చూసి తాను వెనుదిరిగానని ఆమె అన్నారు. స్టేడియంలో జరిగిన ఘటనకు ఆమె క్షమాపణలు కోరారు. అదే సమయంలో, ఈ ఘటనపై జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దర్యాప్తు అనంతరం నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :