Studio18 News - జాతీయం / : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు సీతారాం ఏచూరి. గత నెల 19 నుంచి శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యతో ఏచూరి చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం విషమించింది, ఈనెల 9వ తేదీ నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. ఏచూరి మృతికి కమ్యూనిస్టు నేతలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
Admin
Studio18 News