Wednesday, 16 July 2025 11:42:51 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

లండన్ వేదికగా పాక్ తీరును ఎండగట్టిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

Date : 02 June 2025 02:44 PM Views : 50

Studio18 News - జాతీయం / : ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ, భారత్‌పై నిత్యం విషం చిమ్ముతున్న పాకిస్థాన్ వైఖరిని భారత అఖిలపక్ష బృందం అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ నాయకత్వంలోని బృందం లండన్‌లో పర్యటించింది. ఈ బృందంలో సభ్యురాలైన శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, పాకిస్థాన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న భారత్ జీ-20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తుంటే, పొరుగునే ఉన్న పాకిస్థాన్ మాత్రం టీ-20 (టాప్-20) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడులకు సూత్రధారి అయిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం ఇచ్చిందని ప్రియాంక చతుర్వేది గుర్తుచేశారు. లాడెన్‌కు పాకిస్థాన్ ఎలా ఆశ్రయం కల్పించింది, ఉగ్రవాదులకు నిధులు ఎలా సమకూర్చింది, వారికి శిక్షణ ఎలా ఇచ్చింది, ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా ప్రోత్సహించింది అనే విషయాలపై ఒక డాక్యుమెంటరీ కూడా ఉందని, దాన్ని అందరూ తప్పకుండా చూడాలని ఆమె సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోందని ప్రియాంక అన్నారు. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలకు మాత్రమే స్థానం ఉందని, విద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం భారత బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' గురించి కూడా అక్కడివారికి వివరించారు. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టి పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత కూడా పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికీ, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే భారత ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపి, పాకిస్థాన్ చర్యలను వారి ముందు ఉంచుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :