Studio18 News - జాతీయం / : హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన గెలుపుపై వినేశ్ ఫొగాట్ స్పందించారు. ఇక్కడి నుంచి సమీప బీజేపీ అభ్యర్థిపై ఆమె 6 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తన గెలుపు అనంతరం ఆమె మాట్లాడుతూ... ఇది ఎల్లప్పుడూ దేశంలో పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి గెలుపు అన్నారు. మహిళల పోరాటం వృథా కాదని ప్రజలు నిరూపించారని వ్యాఖ్యానించారు. ఈ దేశం తనకు ఇచ్చిన ప్రేమను ఎప్పటికీ నిలబెట్టుకుంటానన్నారు. వారు హర్యానా హీరోలు కాదు: బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ జాట్ మెజార్టీగా ఉన్న సీట్లను బీజేపీ గెలుచుకుందని బ్రిజ్ భూషణ్ అన్నారు. రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్న కొంతమంది రెజ్లర్లను హర్యానా రాష్ట్ర హీరోలుగా చెప్పలేమని వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి అన్నారు. అసలు జూనియర్ రెజ్లర్లందరికీ వారే విలన్లు అని విమర్శించారు. కొంతమంది తమ గెలుపు కోసం నా పేరును వినియోగించుకున్నారంటే వారు గెలవడానికి నేను దోహదపడినట్లే అన్నారు. హర్యానాలో ఆమె గెలిచి ఉండవచ్చు... కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తించాలన్నారు.
Admin
Studio18 News