Sunday, 08 February 2026 11:40:35 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

సంపన్నుల కోసం ప్రజాస్వామ్యం ఎదురుచూడాల్సిందే.. హర్ష్ గోయెంకా సెటైరికల్ ట్వీట్

మలబార్ హిల్స్ లోని సెలబ్రిటీలు ఓటేయకపోవడంపై విమర్శ పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ కోసం చూస్తారని వ్యంగ్యం సాధారణ జనంతో క్యూలో వెళ్లి ఓటే

Date : 20 November 2024 01:17 PM Views : 419

Studio18 News - జాతీయం / : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెలబ్రిటీలను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఓటేయడానికి వెళ్లాలంటే మలబార్ హిల్స్ లోని సంపన్నులకు ఎక్కడలేని విసుగని, పోలింగ్ బూత్ వద్ద వాలెట్ పార్కింగ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తారని విమర్శించారు. మనీశ్ మల్హోత్రా తన ఔట్ ఫిట్ కు సూటయ్యే కళ్ల జోడు కోసం వెతికేంత వరకూ ప్రజాస్వామ్యం వేచి ఉండాల్సిందేనని అన్నారు. ఇక, పోలింగ్ కేంద్రానికి బెంజ్ లో వెళ్లాలా? లేక బీఎండబ్ల్యూలో వెళ్లాలా? అనేది వారికి ఎదురయ్యే అతి పెద్ద సమస్య అని ఎద్దేవా చేశారు. పోలింగ్ బూత్ వద్ద సామాన్యులతో కలిసి క్యూలో వెళ్లి ఓటేయడాన్ని వారు నామోషీగా భావిస్తుంటారని హర్ష్ గోయెంకా మండిపడ్డారు. ఈ సమస్యలను తప్పించుకోవడానికి వారు ఓటేయడమే మానుకుంటారని తీవ్రంగా విమర్శించారు. ముంబైలో పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ ప్రతిసారీ అతి తక్కువ పోలింగ్ నమోదవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైతో పాటు పూణె, నాగ్ పూర్ వంటి నగరాల్లోనూ సగటు పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవుతుందన్నారు. కాగా, బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, తొమ్మిది గంటల వరకు అంటే.. తొలి రెండు గంటల్లో కేవలం 6.61 శాతం పోలింగ్ మాత్రమే నమోదైందని అధికారులు వెల్లడించారు.

Also Read : దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు.. దీటుగా బదులిచ్చిన ఉపాసన

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :