Wednesday, 16 July 2025 11:51:29 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

విద్యార్థి పెన్సిల్ షార్ప్‌నర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో ఘటన స్కూళ్లలో విద్యార్థుల ఫిర్యాదుల కోసం పింక్‌ బాక్స్‌లు ఏర్పాటు చేసిన పోలీసులు నవంబర్ నెలలో మొత్తం 12 ఫిర్యాదులు అన్నింట

Date : 03 December 2024 11:28 AM Views : 201

Studio18 News - జాతీయం / : స్కూల్‌లో ఓ విద్యార్థి నుంచి చోరీకి గురైన పెన్సిల్ షార్ప్‌నర్‌ కేసును ఛేదించిన పోలీసులపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క చర్యతో విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసాన్ని పాదుకొల్పారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలోని స్కూళ్లలో పోలీసులు పింక్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే తమ ఫిర్యాదులను ఓ కాగితంపై రాసి ఆ బాక్స్‌లో వేస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. తాజాగా ఈ బాక్స్‌లను ఓపెన్ చేయగా నవంబర్ నెలకు గాను మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని స్కూలు బస్సుల్లో గొడవలు, తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య పోట్లాటలు వంటి ఫిర్యాదులతోపాటు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ పరిష్కరించనందుకు టీచర్లు కొట్టారని ఇద్దరు విద్యార్థులు ఫిర్యాదు చేయగా, క్లాసులో విద్యార్థులు ఎక్కువగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులు అందాయి. అయితే, ఒక విద్యార్థి మాత్రం తన పెన్సిల్ షార్ప్‌నర్ పోయిందని ఫిర్యాదు చేశాడు. విద్యార్థుల ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించారు. ఫిర్యాదు చేసిన విద్యార్థులను కలిసి వారి సమస్యలను పరిష్కరించారు. విద్యార్థుల మధ్య గొడవలను నివారించేలా మధ్యవర్తిత్వం చేశారు. వారి వాదనలు విని సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. అలాగే, పోయిన షార్ప్‌నర్ వెతికి పట్టుకుని బాధిత బాలుడికి అప్పగించారు. ఈ విషయాన్ని యూపీ పోలీసులు ఎక్స్ ద్వారా వెల్లడించారు. విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చేసిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ యూజర్ మాత్రం.. 20 ఏళ్ల వారి ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారా? అని ప్రశ్నిస్తూ.. తన సేఫ్టీ పిన్ పోయిందని, అది తుప్పుపట్టి కాస్త మెలితిరిగి ఉందని కొన్ని క్లూలు కూడా ఇచ్చారు. దానిని కూడా వెతికిస్తారా? అని జోక్ చేశారు.

Also Read : కేసీఆర్ ను రేవంత్ 'కలుపు మొక్క' అనడంపై కవిత స్పందన

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :