Wednesday, 04 March 2026 09:27:11 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Sudha Murthy: నేను చెబుతున్నట్లుగా ఉన్న ఆ వీడియో మాయలో పడొద్దు: ఇన్ఫోసిస్ సుధామూర్తి

Date : 19 December 2025 06:52 PM Views : 149

Studio18 News - జాతీయం / : పెట్టుబడి అవకాశాల కోసం లింక్‌పై క్లిక్ చేయమని ప్రజలను సుధామూర్తి కోరుతున్న డీప్‌ఫేక్ వీడియో లింక్ నకిలీది కావడంతో స్పందించిన సుధామూర్తి తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని ఎవరికీ సూచించలేదన్న సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి పెట్టుబడి అవకాశాల కోసం ఒక లింక్‌పై క్లిక్ చేయమని ప్రజలను కోరుతున్నట్లుగా ఉన్న ఒక డీప్‌ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ లింక్ నకిలీదని గుర్తించిన సుధామూర్తి ఈ విషయంపై స్పందించారు. తాను పెట్టుబడులు పెట్టాలని ఎప్పుడూ సూచనలు చేయలేదని, ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. "చాలామంది పెట్టుబడిదారులు ఇందులో చేరారు. నెలకు రూ. 10 లక్షల నుండి సంపాదిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మా బృందం ఇకపై కొత్త క్లయింట్ల ప్రవాహాన్ని నిలువరించలేకపోతున్నాము. అందుకే ఇప్పుడు రిజిస్ట్రేషన్ నిలిపివేయాల్సి వచ్చింది. ఇందులో చేరాలనుకునే వారికి ఈరోజు నమోదు చేసుకోవడానికి చివరి అవకాశం కల్పిస్తున్నాము. కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ పెట్టుబడిదారుల జాబితాలో చేరండి" అని ఆ డీప్‌ఫేక్ వీడియోలో సుధామూర్తి చెప్పినట్లుగా ఉంది. ఈ వీడియోపై సుధామూర్తి స్పందిస్తూ డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని ఎవరికీ సూచించలేదని, ఇలాంటి వీడియోలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ వీడియోల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :