Monday, 23 June 2025 03:21:12 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలకు కోర్టు ఆదేశాలు

Date : 13 September 2024 03:43 PM Views : 147

Studio18 News - జాతీయం / : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ సమర్పించిన బెయిల్ బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదించింది. ఆయనను విడుదల చేయాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు పూచీకత్తులతో పాటు రూ.10 లక్షల బెయిల్ బాండ్లను ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నందున... ఈ కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. ఇంతకాలం ఆమ్ ఆద్మీ కుటుంబ సభ్యులు గట్టిగా నిలబడ్డారని, అందుకు ధన్యవాదాలు అని కేజ్రీవాల్ సతీమణి సునితా కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వంటి నిజాయితీపరుడు, దేశభక్తి కలిగిన నేత మరొకరు లేరని రుజువైందని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఆయన అరెస్ట్‌కు బీజేపీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్న వ్యక్తిని జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంగా తాను న్యాయస్థానానికి, రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు సెల్యూట్ చేస్తున్నానన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో తమ పార్టీ మరింత పుంజుకుంటుందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా అన్నారు. ఈరోజు ఢిల్లీలో, దేశంలో ఎంతో సంతోషం కనిపిస్తోందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీకీ నాయకత్వం వహిస్తారన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :