Wednesday, 25 June 2025 07:05:08 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Pakistan: షాంఘై సదస్సు వేళ.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలపై పాకిస్థాన్ కీలక ప్రకటన

Date : 08 October 2024 11:56 AM Views : 107

Studio18 News - జాతీయం / : ఇస్లామాబాద్ వేదికగా అక్టోబర్ 15-16 మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆతిథ్య దేశం పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘భారత బృందం పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ స్పష్టమైన విధానంతో ఉంది. సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబర్ 5న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి’’ అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు. కాగా ఇస్లామాబాద్‌లో జరిగే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :