Studio18 News - జాతీయం / : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓడిపోయారు. ఆమె శ్రీగుప్వారా-బిజ్‌బెహారా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆమె నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ఇల్తిజా ముఫ్తీ తన ఓటమిని అంగీకరించారు. ఆమె ఎక్స్ వేదికగా తన ఓటమిపై స్పందించారు. "నేను ప్రజాతీర్పును అంగీకరిస్తున్నాను. బిజ్‌బెహారాలో ప్రతి ఒక్కరు తనపై ప్రేమ, అప్యాయతను చూపించారు. వారి ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో నా గెలుపు కోసం పని చేసిన పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు" అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 8 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 30 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బసోహ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ 12,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్ గురెజ్(ఎస్టీ) స్థానం నుంచి 1,132 ఓట్ల మెజార్టీతో, సల్మాన్ సాగర్ హజ్రత్‌బాల్ నుంచి 10,295 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Admin
Studio18 News