Sunday, 08 March 2026 03:51:33 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Logitech: కొత్తరకం మౌస్ ను తీసుకువచ్చిన లాజిటెక్... ఇలాంటిది ఎక్కడా లేదు!

వెర్టికల్ మౌస్ ను తీసుకువచ్చిన లాజిటెక్ మణికట్టు నొప్పి ఉన్నవారికి ఉపయోగపడే మౌస్ ధర రూ.12 వేలకు పైనే!

Date : 20 March 2025 11:24 AM Views : 341

Studio18 News - జాతీయం / : కంప్యూటర్ యాక్సెసరీస్ తయారీదారు లాజిటెక్ కొత్తరకం మౌస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్ గా కాస్త ఉబ్బెత్తుగా ఉండే మౌస్ మాదిరిగా కాకుండా, నిలువుగా కనిపిస్తుంది. అంటే వెర్టికల్ మౌస్ అన్నమాట. దీన్ని లాజిటెక్ 'ఎంఎక్స్ వెర్టికల్ మౌస్' పేరిట మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ప్రత్యేకమైన డిజైన్ ద్వారా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎక్కువసేపు డెస్క్‌ల వద్ద పనిచేసేవారికి ఇది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుందని లాజిటెక్ చెబుతోంది. ఈ మౌస్ కుడిచేతి వాటం ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ధర బాగా ఎక్కువే. దీని ధర రూ. 12,295. సాధారణ ఉద్యోగుల కంటే ప్రొఫెషనల్స్ కు ఇది బాగా ఉపయోగపడుతుంది. లాజిటెక్ MX వెర్టికల్ మౌస్ యొక్క ముఖ్యమైన అంశం దాని డిజైన్. దీని 57-డిగ్రీల కోణం మణికట్టుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పైభాగం రబ్బరు పూతతో ఉండడం వల్ల గట్టి పట్టు లభిస్తుంది. మౌస్‌పై మొత్తం 5 బటన్లు ఉన్నాయి. వీటిని Logitech Options APP ద్వారా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఈ యాప్ విండోస్, మాక్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లలో కూడా పనిచేస్తుంది. బ్లూటూత్ లేదా USB-C కేబుల్ ద్వారా పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ లేని డెస్క్‌టాప్‌ల కోసం, లాజిటెక్ ఒక యూనివర్సల్ రిసీవర్‌ను అందిస్తుంది. కాగా, దీని బ్యాటరీ లైఫ్ నాలుగు నెలల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది. దీన్ని ఒకేసారి ఎక్కువ డివైస్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన 57-డిగ్రీల వంపు డిజైన్ చేతి కదలికలను 10 శాతం వరకు తగ్గిస్తుందని లాజిటెక్ పేర్కొంది. ఎక్కువసేపు డెస్క్‌ల వద్ద పనిచేసేవారికి, మణికట్టు నొప్పి సమస్యతో బాధపడేవారికి లాజిటెక్ MX వెర్టికల్ మౌస్ ఉపయోగపడుతుంది. దీని ఎర్గోనామిక్ డిజైన్ మణికట్టుకు మంచి విశ్రాంతిని ఇస్తుంది. ముఖ్యంగా మణికట్టు నొప్పితో బాధపడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన వారికి దీని అధిక ధర అంత సమర్థనీయం కాదన్నది నిపుణుల మాట.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :