Sunday, 15 March 2026 10:09:41 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

బాలుడ్ని హత్య చేసిన తల్లి ప్రియుడు.. సూట్‌కేస్‌లో మృతదేహం

పదేళ్ల బాలుడ్ని అతడి తల్లి ప్రియుడు హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి చెట్ల పొదల్లో పడేశాడు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్

Date : 12 May 2025 02:42 PM Views : 392

Studio18 News - జాతీయం / : గౌహతి: పదేళ్ల బాలుడ్ని అతడి తల్లి ప్రియుడు హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి చెట్ల పొదల్లో పడేశాడు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి తల్లి ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. (Boy Killed By Mother’s Lover) అస్సాం రాజధాని గౌహతిలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళకు చెందిన పదేళ్ల కుమారుడు శనివారం అదృశ్యమయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, భర్త నుంచి విడిపోయిన ఆ మహిళకు జితుమోని హలోయి అనే వ్యక్తితో సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. మహిళ ప్రియుడైన అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కుమారుడ్ని తానే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్‌ అధికారి తెలిపారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి చెట్ల పొదల వద్ద పడేసినట్లు చెప్పాడన్నారు. దీంతో అక్కడకు వెళ్లి బాలుడి మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు నిందితుడు జితుమోని హలోయిని అరెస్ట్‌ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి ప్రియురాలైన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాలుడి హత్యలో తల్లి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. విడిపోయిన మహిళ భర్త స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :