Sunday, 08 March 2026 03:34:14 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాక్ మరోసారి వస్తే కోలుకునే అవకాశమివ్వం: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

Date : 30 May 2025 06:02 PM Views : 325

Studio18 News - జాతీయం / : భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ, 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత నౌకాదళం ప్రదర్శించిన అద్భుతమైన సముద్ర సంసిద్ధతను కొనియాడారు. అదే సమయంలో పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, "శక్తిమంతమైన దాడులతో భారత్ దూసుకురావడంతో, సైనిక చర్యలను ఆపాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించింది. మనం మన నిబంధనలకు అనుగుణంగానే ఆపరేషన్‌ను నిలిపివేశాం. ఆ సమయంలో నౌకాదళం పాత్ర ప్రశంసనీయం. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేయగా, అదే సమయంలో సముద్రంలో మన నౌకాదళం చూపిన సంసిద్ధత పాకిస్థాన్ నౌకాదళాన్ని కనీసం ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా చేసింది" అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. "మీరు (నౌకాదళం) ముందుగానే మోహరించడంతో పాకిస్థాన్ ధైర్యం దెబ్బతింది. మీరు పాక్‌పై ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. మీ సన్నద్ధతే ఆ దేశానికి బలమైన సందేశాన్ని పంపింది. భారత నౌకాదళ శక్తిని, సైనిక సామర్థ్యాలను చూసి శత్రుదేశం భయంతో వణికిపోయింది" అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. "పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే, ఈసారి కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత తీవ్రంగా ప్రతిస్పందిస్తాం" అని ఆయన హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :