Monday, 23 June 2025 03:07:01 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Crime News: కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే ఉంచిన కొడుకు

Date : 22 October 2024 10:47 AM Views : 108

Studio18 News - జాతీయం / : అస్సాంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. గౌహతి నగరంలోని జ్యోతికూచి ఏరియాలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లి మృతదేహంతో ఓ వ్యక్తి ఏకంగా మూడు నెలలు ఇంట్లోనే నివసించాడు. అస్థిపంజరం అవశేషాలు బయటపడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయింది పూర్ణిమా దేవిగా (75) పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి కొడుకు పేరు జయదీప్ దేయ్ అని, అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు చెప్పారని వివరించారు. కాగా మృతదేహం బయటపడడంతో జయదీప్ దేయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించనున్నట్టు తెలిపారు. ఇక ఆ ఇంటిని ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు బృందం పరిశీలించాయి. అస్థిపంజరానికి శవపరీక్ష నిర్వహించాల్సి ఉందని తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి దేయ్ మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు ఏమంటున్నారంటే.. దేయ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని, అందుకే చాలా మంది అతడితో మాట్లాడేవారు కాదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. తండ్రి బతికి ఉన్నప్పుడు ఆయనను తిట్టేవాడని, ఎవరితోనైనా మాట్లాడటానికి తల్లి బయటికి వస్తే ఆమెను కూడా తిట్టేవాడని వివరించారు. ఇక గత కొన్ని నెలలుగా ఎప్పుడూ ఇంటికి తాళం వేసి ఉంచేవాడని పేర్కొన్నారు. తన తల్లి బాగానే ఉందని, ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదని కొంతమందికి అతడు చెప్పినట్టు కొందరు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :