Monday, 08 December 2025 03:51:05 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్!

Date : 13 November 2025 07:24 PM Views : 154

Studio18 News - జాతీయం / : మహారాష్ట్రలోని అమరావతిలో పెళ్లి వేదికపై వరుడిపై కత్తితో దాడి డీజే డాన్స్‌లో తోశాడన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు బైక్‌పై పారిపోతున్న నిందితులను వెంబడించిన వెడ్డింగ్ డ్రోన్ సుమారు రెండు కిలోమీటర్ల పాటు డ్రోన్‌తో ఛేజ్ చేసిన ఆపరేటర్ డ్రోన్ ఫుటేజ్ కేసులో కీలక ఆధారంగా మారిందన్న పోలీసులు ప్రస్తుతం వరుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి మహారాష్ట్రలోని అమరావతిలో ఒక వివాహ వేడుకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేదికపైనే వరుడిని కత్తితో పొడిచిన దుండగులు, పారిపోతుండగా వారిని వెడ్డింగ్ డ్రోన్‌తో వెంబడించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో డ్రోన్ ఆపరేటర్ చాకచక్యం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. అమరావతి బడ్నేరా రోడ్డులోని సాహిల్ లాన్‌లో సోమవారం ఉదయం 9:30 గంటలకు సుజల్ రామ్ సముద్ర (22) వివాహం జరుగుతోంది. అందరూ చూస్తుండగానే రఘో జితేంద్ర భక్షీ అనే వ్యక్తి వేదికపైకి వచ్చి వరుడు సుజల్‌పై కత్తితో మూడుసార్లు దాడి చేశాడు. అడ్డుకోబోయిన వరుడి తండ్రిపై కూడా దాడికి యత్నించాడు. అనంతరం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఆ సమయంలో వివాహ వేడుకను చిత్రీకరిస్తున్న డ్రోన్ ఆపరేటర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. పారిపోతున్న నిందితుల వైపు డ్రోన్‌ను తిప్పి వారిని వెంబడించాడు. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వారి కదలికలను డ్రోన్ కెమెరాలో బంధించాడు. డ్రోన్ ఆపరేటర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే నిందితులను గుర్తించడానికి బలమైన ఆధారాలు లభించాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ చౌహాన్ తెలిపారు. ఈ దాడికి కారణం చాలా చిన్నదని పోలీసులు వెల్లడించారు. డీజే కార్యక్రమంలో డాన్స్ చేస్తున్నప్పుడు వరుడు సుజల్.. నిందితుడు భక్షీని పక్కకు తోశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న భక్షీ, పెళ్లి రోజున ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :