Saturday, 24 January 2026 08:36:01 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

జమ్మూకశ్మీర్ లో ముగిసిన ఎన్ కౌంటర్... ముగ్గురు ముష్కరులు హతం

Date : 13 May 2025 12:52 PM Views : 369

Studio18 News - జాతీయం / : దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఈరోజు జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకున్న భద్రతా దళాలు, ఇప్పుడు లోయలోపల కూడా ఉగ్రవాద నిర్మూలన చర్యలను తీవ్రతరం చేశాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, షోపియాన్ జిల్లా పరిధిలోని షుక్రు కెల్లర్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో అప్రమత్తమైన సైనిక బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు చర్యలు కొనసాగుతుండగా, ఓ చోట ఉన్న ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు తక్షణమే ప్రతిస్పందించి, ఎదురుకాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకరమైన కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా భద్రతా దళాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని వారు స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :