Studio18 News - జాతీయం / : Helicopter Crash: మహారాష్ట్ర పూణెలోని బవధాన్ బుద్రుక్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఇద్దరు పైలెట్లు, ఓ ఇంజనీర్ హెలికాప్టర్ లో ముంబైకి వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. హెలికాప్టర్ కూలిపోయిన విషయాన్ని గ్రామస్తులు హింజేవాడి పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. పోలీసులు వైద్య బృందం సహయాంతో సంఘటన స్థలంకు చేరుకున్నారు. అయితే, హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆక్స్ ఫర్డ్ గోల్ఫ్ క్లబ్ లోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విమానయాన అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. విమానం కూలిపోవటానికి కారణం ఏమిటి.. అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. మృతుల్లో పైలట్లు పరమజిత్ సింగ్, జీకే పిళ్లై, ఇంజనీర్ ప్రీతమ్ భరద్వాజ్ ఉన్నారు. ఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడటంతోపాటు దట్టమైన పొగలు అలముకున్నాయని స్థానికులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 24న పూణెలో హెలికాప్టర్ కూలిన ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ముంబైలోని జుహు నుంచి హైదరాబాద్వ వైపు హెలికాప్టర్ బయలుదేరింది. ఆ సమయంలో ప్రతికూల వాతావరణం, సాంకేతిక లోపం కారణంగా ఫూణెలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ గ్లోబల్ హెలికాప్టర్స్ అనే ప్రైవేట్ కంపెనీకి చెందింది. నెలన్నర వ్యవధిలోనే తాజాగా పూణెలో మరో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది.
Admin
Studio18 News