Studio18 News - జాతీయం / : Ratan Naval Tata : ఆకాశమంత ఎత్తు ఆయన వ్యక్తిత్వం. మాటల్లో వర్ణించలేనంత శిఖరం అతడు. ఆయనలాగా ఉండలేము అన్న భావనకు ప్రతిరూపం. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా అడుగు తీసి అడుగు వేస్తే హడావిడితో హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే స్థాయి ఉన్నా.. సింప్లిసిటీకే ఇంపార్టెన్స్ ఇచ్చే వారు. సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్, హెల్పింగ్ నేచర్ తో పర్వతమంత స్థాయికి ఎదిగారు. బతికినంత కాలం నిరాడంబరంగా ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారి మానవత్వం చూపించారు. వ్యాపార దిగ్గజంగా నిలదొక్కుకున్న రతన్ టాటా.. ఓ తొలకని కుండ. దేశంలో ఎందరో వ్యాపార దిగ్గజాలు ఉన్నప్పటికీ.. ప్రజల మదిలో ఆయనకే ఎందుకు శిఖర స్థాయి? సామాన్యుడి నుంచి దేశ ప్రధాని వరకు ఎందుకు ఎమోషనల్ అవుతున్నట్లు? ఆ మనసున్న మహారాజు చూపించిన మార్గం ఏంటి? స్థాయితో విలువ రాదు. వచ్చినా అది ఎక్కువ రోజులు నిలబడదు. వ్యక్తిత్వమే మనిషిని నిలబెడుతుంది. గుర్తింపును తీసుకొస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే రతన్ టాటా. ఏ మనిషైనా, ఏ స్థాయికి ఎదిగినా.. పొగడరా.. నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా పెద్ద బిజినెస్ టైకూన్ గా పేరు తెచ్చుకున్నా.. దేశమే మొదటి ప్రాధాన్యతగా నడుచుకున్నారు. బిజినెస్ మ్యాన్ అంటే ఆయనలాగా ఉండాలి అనే పేరు, గొప్పదనం సంపాదించారు. ప్రజల హృదయాల్లో తనకంటూ కొంత స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. ఓ చిన్న ఉద్యోగి నుంచి టాటా గ్రూప్స్ చీఫ్ వరకు ఎదిగిన ఆయన.. హోదా, ఆస్తిపాస్తులు, సంపాదనతో సంబంధం లేకుండా సింపుల్ జీవితం గడిపారు. రతన్ టాటా సక్సెస్ ఫుల్ బిజినెస్ టైకూన్ ఎలా అయ్యారు? ఆ మేరు పర్వతం లేని లోటు పూడ్చేదెవరు? 100కు పైగా దేశాలు, 30కి పైగా కంపెనీలు, లక్షల కోట్ల విలువైన పెట్టబుడులు. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది టాటా గ్రూప్ సామ్రాజ్యం. ఆ వ్యవస్థను నడిపించిన అతడిని చూస్తే మాత్రం అలా కనిపించరు. విలక్షణ వ్యాపార నిర్ణయాలతో, వూహ్యాత్మక ప్రణాళికలతో టాటా గ్రూప్ ను సరికొత్త శిఖరాలకు చేర్చిన రతన్ టాటా.. యావత్ ప్రపంచానికి పారిశ్రామిక దిక్సూచి అయ్యారు. అయినప్పటికి నిరాండబర జీవితాన్ని గడిపిన గొప్ప మానవతా మూర్తి రతన్ టాటా. వ్యాపార విలువలే ఆస్తిగా, అసమాన మానవతా మూర్తిగా కీర్తి గడించిన రతన్ టాటా.. ఎనలేని గుర్తింపు పొందారు. ఉన్నత కుటుంబంలో పుట్టి, అగ్ర రాజ్యం అమెరికాలో చదివి, మంచి సంపాదన, పొజిషన్ ఉన్నా సాదాసీదా జీవితమే గడిపారు. టాటా గ్రూప్ ను తిరుగులేని వ్యాపారం సామ్రాజ్యంగా నిలిపారు. బిల్ గేట్స్ కంటే ధనవంతుడైన రతన్ టాటా.. ఎప్పుడూ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో నిలువలేదు. కారణం.. ఆయన సంపాదనలో 65శాతం విరాళాలు, పేదల కోసమే ఖర్చు చేయడమే.
Admin
Studio18 News