Sunday, 08 March 2026 10:44:12 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ

కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారికి మోదీ నివాళులర్పించలేదని ఆరోపణ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమివ్వాలన్న రాహుల్ గాంధీ విపక్షాలు తమ గళాన్ని

Date : 19 March 2025 02:57 PM Views : 338

Studio18 News - జాతీయం / : మహా కుంభమేళా భారత సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలను ప్రతిబింబించిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే, కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందినవారికి ప్రధాని మోదీ నివాళులర్పించలేదని ఆయన విమర్శించారు. కుంభమేళాకు వెళ్లిన యువత దేశ ప్రధానమంత్రి నోట మరో మాట కూడా వినాలని భావించారని, వారికి ఉద్యోగాలు కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అన్నారు. విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. సభలో ప్రధానమంత్రి లేదా మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు మాట్లాడేందుకు అనుమతి ఉండదని, ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పామని అన్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి నిబంధనలు అర్థం కాలేదని ఆయన విమర్శించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :