Wednesday, 04 March 2026 09:26:22 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Viral news | మద్యం ఎక్కువైందా.. అయితే మేమే ఇళ్ల దగ్గర దిగబెడుతాం : కర్ణాటక హోంమంత్రి

Viral news | న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌ సందర్భంగా అతిగా మద్యం సేవించినవారితో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీ

Date : 31 December 2025 07:30 PM Views : 225

Studio18 News - జాతీయం / : Viral news : న్యూ ఇయర్‌ సెలెబ్రేషన్స్‌ సందర్భంగా అతిగా మద్యం సేవించినవారితో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని వారి ఇళ్ల దగ్గర దింపుతామని, బెంగళూరు పోలీసులు ఈ బాధ్యతలు చూసుకుంటారని ఆ రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ప్రతి ఒక్కరినీ ఇళ్లదగ్గర దింపడం వీలుకాదు కాబట్టి.. మత్తు దిగేవరకు వారిని ఉంచేందుకు సిటీలో 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. అయితే తాగినమైకంలో అసభ్యంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బార్లు, పబ్‌లలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాలతో సమస్య లేదని, కానీ రద్దీ ఎక్కువగా ఉండే బెంగళూరు, మైసూర్‌, హుబ్బళి, బెలగావి, మంగళూరులో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్‌డేట్ ఇచ్చారు. ట్రాఫిక్‌, మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని బెంగళూరు వ్యాప్తంగా 20 వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామని చెప్పారు. వారిలో ప్రత్యేకంగా శిక్షణపొందిన మహిళా బృందం కూడా ఉందన్నారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :