Thursday, 22 May 2025 02:54:55 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Cyclone Dana: దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది? అర్థం ఏమిటి?

Date : 24 October 2024 02:14 PM Views : 116

Studio18 News - జాతీయం / : తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ తీవ్రంవైపు దూసుకోస్తోంది. ఇవాళ (గురువారం) రాత్రికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా ఈ తీవ్ర తుపానుకు ‘దానా’ అనే పేరు ఎలా వచ్చింది? దీని అర్థం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. ‘దానా’ అనేది అరబిక్ పదం. ఈ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది. అరబిక్ భాషలో ఈ పదానికి ‘అత్యంత సంపూర్ణ పరిమాణం, అందమైన ముత్యం, విలువైనది అనే అర్థాలు వస్తాయి. దానా పదాన్ని స్త్రీలకు పేరుగా పెడుతుంటారు. అరబ్ దేశాలలో ఈ పేరు సర్వసాధారణం. ఇక పర్షియన్ భాషలో ‘దానా’ అంటే విరాళం, దానం వంటి అర్థాలు ఉన్నాయి. తుపానులను సులువుగా గుర్తించడం, ముప్పు నుంచి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ విధంగా పేర్లు పెడుతున్నారు. తుపానులకు సంబంధించి దేశాల మధ్య మెరుగైన సమాచారం పంపిణీ కూడా ఒక కీలక లక్ష్యంగా ఉంది. ఈ విధంగా పేర్లు పెట్టడం ద్వారా తుపానులను ట్రాక్ చేయడం‌తో పాటు మీడియాకు సులువుగా సమాచారం అందించేందుకు వీలుంటుంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుపానులకు పేర్లు పెట్టేందుకు ఏప్రిల్ 2020లో 13 దేశాలు సమూహంగా ఏర్పడ్డాయి. ఈ జాబితాలో భారత్, బంగ్లాదేశ్, ఖతార్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. అయితే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తుపానుల నామకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షిస్తుంది. పేర్లు సాంస్కృతికంగా తటస్థంగా, పలకడానికి సులభంగా, ఏ వర్గాన్ని కించపరచకుండా ఉండాలని సూచనలు చేసింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా దేశాలు పదాలను సూచిస్తుంటాయి. అంతర్జాతీయ నామకరణ విధానానికి అనుగుణంగా ‘దానా’ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :