Studio18 News - జాతీయం / : Manipur : స్థానిక తెగల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ ( Yumnam Khemchand Singh) ఎంపికయ్యారు. బీజేపీ నాయకుడైన ఆయన బీరెన్ సింగ్ వారసుడిగా.. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్వరలోనే మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మణిపూర్‌లోని ప్రధానమైన మీటీస్, కుకిస్ తెగల మధ్య నిరుడు విభేదాలు తారా స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రిగా నేను ఉండలేనంటూ నిరుడు ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా ఉంది. ఆయన వారుసుడిగా బాధ్యతలు చేపట్టేది ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది.
Admin
Studio18 News