Sunday, 08 March 2026 03:48:08 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

పెళ్లి గిప్ట్ రూపంలో పార్శిల్ బాంబు..ఇద్దరు మృతికి కారణమైన అధ్యాపకుడికి జీవిత ఖైదు

Date : 29 May 2025 12:16 PM Views : 311

Studio18 News - జాతీయం / : పెళ్లి కానుకగా పార్సిల్ బాంబు ఇచ్చి వరుడితో పాటు మరో వృద్ధురాలు మృతికి కారణమైన ఓ అధ్యాపకుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఒడిశా రాష్ట్రంలోని బొలాంగిర్ జిల్లాలో 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బుధవారం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. భైన్సాలోని జ్యోతి వికాస్ కళాశాలలో పంజీలాల్ మెహర్ అనే వ్యక్తి అధ్యాపకుడుగా విధులు నిర్వహించేవాడు. ఇదే కళాశాలలో మహిళా ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న సంయుక్త సాహుతో పంజీలాల్ మెహర్‌కు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సంయుక్త సాహు కుమారుడి వివాహాన్ని ఆసరాగా చేసుకుని వరుడిని హతమార్చాలని పంజీలాల్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా వివాహ కానుకగా పార్సిల్ బాంబును పంజీలాల్ మెహర్ పంపించాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయగానే బాంబు పేలి సంయుక్త సాహు కుమారుడు సౌమ్య సాహు మృతి చెందాడు. అతనితో పాటు పక్కనే ఉన్న నానమ్మ కూడా మృతి చెందింది. పెళ్లి కూతురు తీవ్ర గాయాలతో బయటపడింది. 2018 ఫిబ్రవరి 23న ఈ ఘటన జరగ్గా, అదే ఏడాది మార్చి 23న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఏప్రిల్ నెలలో పంజీలాల్ మెహర్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను ప్రతాప్‌గఢ్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. ఈ కేసును విచారించిన ప్రతాప్‌గఢ్ అదనపు జిల్లా జడ్జి, నిందితుడు పంజీలాల్ మెహర్‌ను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.1.70 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :