Thursday, 12 March 2026 12:49:23 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Piyush Goyal: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Date : 19 November 2025 08:02 PM Views : 290

Studio18 News - జాతీయం / : ఒప్పందం న్యాయంగా, సమతుల్యంగా ఉండాలన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని హామీ ఇప్పటికే ఆరు రౌండ్ల చర్చలు పూర్తి.. కొనసాగుతున్న సంప్రదింపులు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకుంటున్నాయి. ఒప్పందం న్యాయంగా, సమానంగా, సమతుల్యంగా కుదిరిన వెంటనే శుభవార్త వెలువడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో భారత రైతులు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తామని గోయల్ స్పష్టం చేశారు. "మన దేశ ప్రయోజనాలను కాపాడుకోవాలి. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన, సమానమైన పరిష్కారం లభించినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయి. అప్పుడు మీరు శుభవార్త వింటారు" అని ఆయన వివరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఆరు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయని గోయల్ తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతి వంటి దీర్ఘకాలిక ఒప్పందాలు భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని అన్నారు. ఈ స్నేహం శాశ్వతంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుత 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా నుంచి బాదం, పిస్తా, యాపిల్స్ వంటి ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రవేశం కల్పించాలని ఆ దేశం కోరుతోంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికా వరుసగా నాలుగోసారి భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :