Thursday, 05 December 2024 10:05:11 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Subramanian Swamy: శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిష‌న్‌

Date : 23 September 2024 03:03 PM Views : 52

Studio18 News - జాతీయం / : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం క‌ల్తీ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ల‌డ్డూ త‌యారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు క‌ల‌కలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చ‌ర్చ‌ జరుగుతోంది. ఇటు ఈ వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారాయి. ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు చెందిన‌ కోట్లాది మంది భ‌క్తులు కల్తీ లడ్డూ విష‌య‌మై ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవ‌మైన వేంక‌టేశ్వ‌రుడి తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌నే విష‌యాన్ని భ‌క్తులు జీర్ణించుకోవ‌డం కష్టంగా మారింది. దీనికి కార‌ణ‌మైన బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ సామాన్యుల‌ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఈ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణ‌ల‌పై వెంట‌నే విచార‌ణ జ‌ర‌పాల్సిందిగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ సంద‌ర్భంగా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మాట్లాడుతూ... తిరుమ‌ల ప్ర‌సాదం ల‌డ్డూపై చంద్ర‌బాబు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఈ ఆరోప‌ణ‌లు భ‌క్తుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయ‌న్నారు. స‌మ‌గ్ర విచార‌ణ కోసం ఓ క‌మిటీని వేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నిజానిజాలు బ‌య‌ట‌కు రావాల‌నే ఉద్దేశంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెప్పారు. ఇదిలాఉంటే.. శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై టీటీడీ మాజీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో ఓ పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై కోర్టు ఇవాళ మ‌ధ్యాహ్నం 2.15 గంట‌ల‌కు విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :