Sunday, 08 March 2026 11:01:21 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఈశాన్యంలో జలవిలయం.. అస్సాం సిల్చార్‌లో 132 ఏళ్ల రికార్డు బద్దలు!

Date : 02 June 2025 11:43 AM Views : 363

Studio18 News - జాతీయం / : ఈశాన్య భారతంలో జూన్ నెల ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. అస్సాం, మణిపూర్, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది. అస్సాంలోని రెండో అతిపెద్ద నగరమైన సిల్చార్‌లో నిన్న (జూన్ 1న) ఏకంగా 132 ఏళ్లనాటి వర్షపాతం రికార్డు బద్దలైంది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత మూడు రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని సిల్చార్ నగరం నిన్న కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. కేవలం 24 గంటల వ్యవధిలో 415.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. 1893లో నమోదైన 290.3 మిల్లీమీటర్ల వర్షపాత రికార్డును తాజా వర్షం తిరగరాసింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణుల కలయిక వల్లే ఈ అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా మధ్య అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు తీవ్రమైన వాతావరణ కల్లోలం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. మిజోరంలో మే 31న సాధారణం కంటే ఏకంగా 1102 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మేఘాలయలో మే 28 నుంచి జూన్ 1 వరకు ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోహ్రా (చిరపుంజి), మాసిన్రామ్‌లలో వరుసగా 796 మి.మీ., 774.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఖ్లీహ్రియాత్, ఆర్‌కేఎం సోహ్రా, పైనూర్స్లా వంటి ఇతర ప్రాంతాల్లో కూడా 500 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. మే 30న ఆర్‌కేఎం సోహ్రాలో ఒక్కరోజే అత్యధికంగా 378.4 మి.మీ. వర్షం పడగా, మొత్తం ఐదు రోజుల్లో అక్కడ 993.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే మాసిన్రామ్, పైనూర్స్లాలలో కూడా మే 30న ఒక్కరోజే 250 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. మేఘాలయలోని 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. త్రిపురలో ఆకస్మిక వరదల కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణిపూర్‌లో నదులు ఉప్పొంగడం, కట్టలు తెగిపోవడంతో వరదలు సంభవించి, 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. సుమారు 3,365 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :