Studio18 News - జాతీయం / : విద్వేష ప్రసంగం కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) దోషిగా తేలాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు అబ్బాస్ అన్సారీని దోషిగా తేల్చింది. ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీతోపాటు ఆయన సోదరుడు ఉమర్ అన్సారీ (Umar Ansari) కూడా ఈ కేసులో దోషిగా తేలాడు. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో దోషులుగా తేలిన ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతడి సోదరుడు ఉమర్ అన్సారీలకు ‘ది జ్యుడీషియల్ మెజిస్ట్రేట్’ కోర్టు ఇవాళే శిక్షలు ఖరారు చేసే అవకావం ఉంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్‌బీఎస్‌పీ అభ్యర్థి అబ్బాస్ అన్సారీ, అతడి సోదరుడు ఉమర్ అన్సారీ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Studio18 News