Sunday, 08 February 2026 09:57:38 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

పిరికిపందలా పారిపోను.. తొక్కిసలాటపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు!

Date : 09 June 2025 05:01 PM Views : 320

Studio18 News - జాతీయం / : టీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తనపై వస్తున్న రాజీనామా డిమాండ్లపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తీవ్రంగా స్పందించారు. పిరికిపందలా పారిపోను అంటూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ఆయన తాజాగా స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వస్తాయని, అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని కోరారు. జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియం వెలుపల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ, జేడీ(ఎస్) పార్టీలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి పరమేశ్వర నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి, మరికొందరిని బదిలీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని, అసలు బాధ్యులైన మంత్రులను కాపాడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రమంత్రి కుమారస్వామి మరో అడుగు ముందుకేసి, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య, శివకుమార్‌లను పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటానికి అనుమతించడం, ఆ తర్వాత తలెత్తిన గందరగోళానికి వారిద్దరే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి పరమేశ్వర... దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ధారణలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా విచారణ జరిపిస్తామని, దోషులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, తొక్కిసలాటలో మరణాలు సంభవించిన విషయం తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని, ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :