Wednesday, 04 March 2026 09:27:11 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Harassing Student Over Pen Theft | విద్యార్థి పెన్ను దొంగిలించినట్లు ఆరోపణ.. వేధిస్తున్న స్కూల్‌ ప్రిన్సిపాల్‌, టీచర్లపై కేసు

Harassing Student Over Pen Theft | ఒక విద్యార్థి పెన్ను దొంగిలించినట్లు స్కూల్‌ సిబ్బంది ఆరోపించారు. ఆ బాలుడ్ని వారు వేధిస్తుండటంతో అతడు భరించలేకపోయాడ

Date : 26 December 2025 06:09 PM Views : 158

Studio18 News - జాతీయం / : లక్నో: ఒక విద్యార్థి పెన్ను దొంగిలించినట్లు స్కూల్‌ సిబ్బంది ఆరోపించారు. ఆ బాలుడ్ని వారు వేధిస్తుండటంతో అతడు భరించలేకపోయాడు. కుమారుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్కూల్‌ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Harassing Student Over Pen Theft) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో 8 ఏళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. నవంబర్‌ 28న ఒక స్టూడెంట్‌ పెన్ను చోరీ అయ్యింది. అయితే ఆ బాలుడు దొంగిలించినట్లు స్కూల్‌ సిబ్బంది ఆరోపించారు. డిసెంబర్‌ 12న ప్రిన్సిపాల్‌ రూమ్‌కు అతడ్ని పిలిపించారు. పెన్ను దొంగిలించినట్లు ఆ విద్యార్థితో బలవంతంగా ఒప్పించి వీడియో రికార్డ్‌ చేశారు. చోరీ అయిన పెన్ను ధర చెల్లించాలని బాలుడి పేరెంట్స్‌ను ఒత్తిడి చేశారు. కాగా, పెన్ను చోరీ జరిగిన రోజున తమ కుమారుడు స్కూల్‌కు వెళ్లలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తప్పు చేసినట్లుగా బలవంతంగా ఒప్పించి రికార్డ్‌ చేశారని ఆరోపించారు. నాటి నుంచి స్కూల్‌ సిబ్బంది తమ కుమారుడ్ని వేధిస్తున్నారని విమర్శించారు. రాత్రివేళ నిద్ర లేచి ఏడుస్తున్నాడని, ‘మేడం నేను పెన్ను తీయలేదు’ అని కలవరిస్తున్నాడని తెలిపారు. బుక్స్‌తో పాటు గోడలపై ‘హెల్ప్‌’ అని రాయడాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బాలుడి తల్లి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆ స్కూల్‌కు నోటీస్‌ జారీ చేశారు. అయితే పోలీస్‌ స్టేషన్‌కు హాజరుకాలేదని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 23న స్కూల్‌ డైరెక్టర్ దేవరాజ్ సింగ్ రాజవత్, ప్రిన్సిపాల్ అనుప్రీత్ రావల్, టీచర్లు సంగీతా మాలిక్, స్వతంత్ర అగ్నిహోత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :