Thursday, 12 March 2026 03:02:02 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

జర్మనీలో మాజీ ఎంపీని పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా!

Date : 05 June 2025 06:46 PM Views : 324

Studio18 News - జాతీయం / : తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా, బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాలను వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి జర్మనీలో చాలా ప్రైవేట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మహువా మొయిత్రా గానీ, పినాకి మిశ్రా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహువా మొయిత్రా, పినాకి మిశ్రాల వివాహం సుమారు 14 రోజుల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పష్టత కోసం ఓ వార్తా సంస్థ ప్రతినిధి మహువా మొయిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె 1974లో అసోంలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేశారు. 2010లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి, రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆమె, 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఇక పినాకి మిశ్రా విషయానికొస్తే, ఆయన ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. 1959లో జన్మించిన ఆయన, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పినాకి మిశ్రా, 1996లో పూరీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీజేడీలో చేరి, అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇరువురు ప్రముఖ ఎంపీలు, వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం, అలాగే వారి మధ్య వయసులో 15 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ఈ వివాహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పినాకి మిశ్రా వయసు 65 ఏళ్లు కాగా, మహువా మొయిత్రా వయసు 50 ఏళ్లు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :