Studio18 News - జాతీయం / : అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) ఎమ్మెల్యే (MLA) అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లా (Mau district) లోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన అబ్బాస్ అన్సారీ సన్నిహితుడు మన్సూర్ అన్సారీకి కూడా కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీలను ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఉదయం దోషులుగా తేల్చింది. అనంతరం అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మన్సూర్ అన్సారీకి ఆరు నెలల జైలుశిక్ష విధించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్‌బీఎస్‌పీ అభ్యర్థి అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. ఇవాళ ఈ కేసు విచారణ మావు జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో జరిగింది. అక్కడికి అబ్బాస్ అన్సారీతోపాటు అతడి సోదరుడు ఉమర్ అన్సారీ కూడా వచ్చారు.
Admin
Studio18 News