Thursday, 05 December 2024 10:24:21 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

PM Modi: మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

Date : 09 October 2024 12:00 PM Views : 33

Studio18 News - జాతీయం / : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా మోదీ 21వ ఆసియాన్ - ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆసియాన్ - ఇండియాకు లాహోస్ అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో - పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది అని విదేశాంగ శాఖ పేర్కొంది. కాగా, ప్రధాని మోదీ ...రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలను సందర్శించి .. యుద్ధం ముగింపు విషయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం మోదీ ఇటలీ, అమెరికా దేశాల్లో పర్యటించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత స్థాయిలో ఆయన చర్చలు జరిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :