Wednesday, 10 December 2025 12:58:20 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు

Date : 02 June 2025 01:12 PM Views : 241

Studio18 News - జాతీయం / : పోలవరం-బనకచర్ల నీటి తరలింపు ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సుమారు రూ. 81 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు వివరాలను, దాని ద్వారా రైతులు మరియు ప్రజలకు చేకూరే ప్రయోజనాలను రాష్ట్ర అధికారులు వివరించనున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక మంత్రికి స్వయంగా వివరించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు సహా ఇతర ఉన్నతాధికారులు నేడు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేథ్ కి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు కేంద్రానికి అందించనున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణకు సంబంధించిన అంశాలు, ప్రజలకు కలిగే లాభనష్టాలపై స్పష్టమైన చిత్రాన్ని ఇవ్వనున్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆర్థికంగా స్వీయ సమృద్ధి సాధించేలా ఉంటుందని, ఒక స్వయం సమృద్ధ ఆర్థిక ప్రాజెక్టుగా నిలుస్తుందని కూడా వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుపై పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి వ్యక్తమయ్యే అవకాశం ఉన్న అభ్యంతరాలకు కూడా ఈ ప్రజెంటేషన్‌లో సమాధానాలు ఇచ్చేలా ఏపీ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. ఈ సమావేశం ద్వారా ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :