Wednesday, 04 March 2026 09:26:20 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Lalu Prasad Yadav: సింగపూర్ సైనిక శిక్షణకు లాలూ ప్రసాద్ మనవడు

Date : 07 January 2026 07:22 PM Views : 159

Studio18 News - జాతీయం / : శిక్షణ కోసం వెళుతున్న రోహిణి ఆచార్య పెద్ద కొడుకు ఆదిత్య రోహిణి ఆచార్య కుటుంబానికి సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ స్థానిక చట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారికి సైనిక శిక్షణ తప్పనిసరి బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు ఆదిత్య సింగపూర్ లో సైనిక శిక్షణకు వెళుతున్నాడు. రెండేళ్ల పాటు ఆయుధ శిక్షణతో పాటు యుద్ధ సన్నద్ధతకు సంబంధించిన ట్రైనింగ్ పొందనున్నాడు. ఈ విషయాన్ని ఆదిత్య తల్లి, లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య ఎక్స్ లో వెల్లడించారు. రోహిణి ఆచార్య కుటుంబం సింగపూర్ లో స్థిరపడిన విషయం తెలిసిందే. రోహిణితో పాటు ఆమె కుటుంబంలో అందరికీ భారత పౌరసత్వమే ఉంది. అయితే, వారంతా సింగపూర్ లో పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ పొందారు. సింగపూర్ చట్టాల ప్రకారం.. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు రెండేళ్ల పాటు సైనిక శిక్షణ పొందాల్సి ఉంటుంది. సింగపూర్ పౌరులతో పాటు సింగపూర్ పర్మనెంట్ రెసిడెన్సీ పొందిన రెండో తరం పౌరులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఆదిత్యకు ఇటీవలే 18 సంవత్సరాలు నిండడంతో సైనిక శిక్షణకు హాజరవుతున్నాడు. రెండేళ్ల పాటు సాగే ఈ శిక్షణలో ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు వివిధ ఆయుధాల వినియోగంపై ప్రాథమిక శిక్షణ అందిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని రిజర్వ్ దళాలుగా వ్యవహరిస్తారు. భవిష్యత్తులో యుద్ధం సంభవిస్తే ఈ రిజర్వ్ దళాల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :