Wednesday, 16 July 2025 11:19:24 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

Ola: ఓలా స్కూటర్ కొనొద్దని యువతి ప్లకార్డు... స్పందించిన సంస్థ ప్రతినిధులు

Date : 16 September 2024 01:57 PM Views : 163

Studio18 News - జాతీయం / : కర్ణాటకలోని కలబురిగిలో ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కస్టమర్ ఒకరు తీవ్ర అసహనంతో సర్వీస్ స్టేషన్‌కు నిప్పంటించాడు. తాజాగా బెంగళూరులోని మరో కస్టమర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెంగళూరుకు చెందిన నిషా గౌరి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనంతో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అందులో ప్రస్తావించింది. తన స్కూటర్‌కు ప్లకార్డు ప్రదర్శించిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. "ప్రియమైన కన్నడ ప్రజలారా, ఓలా పనికిరాని బైక్. మీరు ఓలా బైక్ కొనుగోలు చేస్తే కనుక అది మీ జీవితాన్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దయచేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయకండి" అని ప్లకార్డును ప్రదర్శించింది. దీనిని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తాను కొనుగోలు చేసిన ఓలా బైక్ ఇబ్బంది పెడుతోందని, తరుచూ బ్రేక్ డౌన్, సాఫ్ట్ వేర్ సమస్యలతో ఇబ్బంది కలుగుతోందని నిషా గౌరి తెలిపింది. ఈ స్కూటర్‌ను కొనడానికి ముందే డబ్బులు చెల్లించి... నెల రోజులు వేచి చూసి తీసుకున్నానని, అయినప్పటికీ వాహనంలో సమస్యలు వస్తున్నాయని తెలిపింది. తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంస్థ ప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కంపెనీ ప్రతినిధులు స్పందించారు. వాహనాన్ని మరమ్మతు చేయించేందుకు తీసుకువెళ్లారు. అంతేకాదు, తాత్కాలికంగా ఆమె నడుపుకోవడానికి వేరే స్కూటర్ ‌ను ఇచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :