Studio18 News - జాతీయం / : సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 72 ఏళ్ల ఏచూరి తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చేరారని, ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఏచూరి ఊపిరితిత్తుల సమస్యతో గత నెల 19న ఎయిమ్స్‌లో చేరారు.
Admin
Studio18 News