Sunday, 08 March 2026 04:14:50 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

'కుర్ కురే' చిచ్చు... కొట్టుకున్న రెండు కుటుంబాలు... 10 మందికి తీవ్ర గాయాలు

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఘటన కాలం చెల్లిన కుర్ కురే అమ్మడంతో గొడవ అరెస్ట్ భయంతో పరారీలో 25 మంది

Date : 24 December 2024 04:16 PM Views : 487

Studio18 News - జాతీయం / : 20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ రెండు కుటుంబాల మధ్య గొడవ పెట్టింది. రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకోవడంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అతీఫుల్లా అనే వ్యక్తికి చెందిన కిరాణా షాపులో సద్దాం అనే వ్యక్తి పిల్లలు ఒక కుర్ కురే ప్యాకెట్ కొన్నారు. అయితే ఎక్స్ పైరీ అయిన కుర్ కురేను అమ్మారంటూ సద్దాం కుటుంబీకులు వచ్చి ప్రశ్నించారు. దీంతో అతీఫుల్లా, సద్దాం కుటుంబాల మధ్య గొడవ ప్రారంభమయింది. ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. ఆ తర్వాత అతీఫుల్లా మనుషులు మరో రెండు వాహనాల్లో వచ్చి సద్దాం హోటల్ లో ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ గొడవలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం రెండు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో అరెస్ట్ భయంతో సుమారు 25 మంది పరారయ్యారు. మరోవైపు 20 రూపాయల కుర్ కురే ఇంత పని చేసిందా? అని స్థానికులు ఆశ్యర్యపోతున్నారు.

Also Read : రెండు గంటల్లో శ్రీవారి దర్శనం... ఏఐ టెక్నాలజీని పరిశీలించిన టీటీడీ సభ్యులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :