Sunday, 08 February 2026 10:59:01 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Donald Trump: ట్రంప్ తీరుతో కీలకమైన భారత్‍ను కోల్పోయే ప్రమాదం ఉంది: అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం

Date : 30 September 2025 06:31 PM Views : 425

Studio18 News - జాతీయం / : భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టిన జాన్ బోల్టన్ సుంకాలు వాణిజ్యం గురించి కాకుండా కక్షతో విధిస్తున్నట్లుగా ఉందని విమర్శ ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాను వదిలి, కేవలం భారత్‌పై టారిఫ్ పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు. చైనా, రష్యాను విడిచిపెట్టి కేవలం భారత్‌పై సుంకాలు విధించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సుంకాలను వాణిజ్యం గురించి కాకుండా వ్యక్తిగత కక్షతో విధిస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కొన్ని లక్ష్యాలతో రెండోసారి అధికారంలోకి వచ్చారని, అందుకోసం ఆయన దేనికైనా సిద్ధమవుతున్నారని విమర్శించారు. అమెరికా రాజకీయాల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు రాకూడదని జాన్ బోల్టన్ ఆకాంక్షించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :