Monday, 30 March 2026 02:47:08 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Bikram Singh Majithia: జైలు నుంచి రిలీజైన బిక్రం సింగ్ మ‌జితియా

Bikram Singh Majithia: మీసాలు తిప్పుకుంటూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు బిక్రం సింగ్ మ‌జితియా. సుమారు 700 కోట్ల అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న కేసులో ఆయ‌న జైలు

Date : 03 February 2026 08:34 PM Views : 68

Studio18 News - జాతీయం / : చండీఘ‌డ్‌: శిరోమ‌ణి అకాళీద‌ల్‌ నేత‌, పంజాబ్ మాజీ మంత్రి బిక్రం సింగ్ మ‌జితియా(Bikram Singh Majithia) ఇవాళ నాభా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న కేసులో సోమ‌వారం సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరీ చేసిన విష‌యం తెలిసిందే. న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ వ‌ల్ల మ‌తిజియా రిలీజై ఆల‌స్య‌మైంది. ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు భార్యతో స‌హా పార్టీ వ‌ర్క‌ర్లు జైలు వ‌ద్ద‌కు వెళ్లారు. జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే మ‌జితియా త‌న స‌హ‌జ‌రీతిలో మీసాల‌ను మెలేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి వెళ్లారు. దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారని శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం బెయిల్‌పై ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు, విచారణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి బిక్రం సింగ్‌పై సిట్ 2025 జూన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే అతడిని అమృత్ సర్‌లోని తన ఇంటి నుంచి పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (వీబీ)కి చెందిన పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు న్యూ నభా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీంతో బిక్రం సింగ్.. పంజాబ్, హరియాణా హైకోర్టులో గతంలోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తర్వాత అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఈ కేసులో గత ఆగష్టులోనే పోలీసులు సప్లిమెంటరీ ఫైల్స్‌తోకలిపి 40,000 పేజీల చార్జిషీటు దాఖలు చేశారు. పంజాబ్‌కు చెందిన మజితియా శిరోమణి అకాళిదల్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశారు. ఈ సమయంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలొచ్చాయి. 2007-2017 మధ్య కాలంలో ఆయన, అతడి భార్య కలిపి వందల కోట్ల అవినీతికి పాల్పడ్డార‌నే ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :