Wednesday, 16 July 2025 11:10:08 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

లేడీ కాదు కిలేడీ... 7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ

Date : 20 May 2025 11:28 AM Views : 71

Studio18 News - జాతీయం / : వయసు పైబడుతున్నా వివాహం కాని యువకులను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నగలు, నగదుతో కొత్త పెళ్లికూతురు పారిపోయిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమవారం భోపాల్‌లో సవాయ్ మాధోపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను ఇదేవిధంగా మోసం చేసిందని బయటపడింది. మహిళ వెనకున్న పెళ్లిళ్ల రాకెట్ ను ఛేదించిన పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేసి ఆమె గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ కు చెందిన అనురాధ పాశ్వాన్ (23) గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ.. ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు మకాం మార్చింది. భోపాల్ లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల రాకెట్ తో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. సంబంధం కుదిర్చిపెడతామని చెప్పి భారీగా కమీషన్ వసూలు చేసి అనురాధ ఫొటో చూపించేవారు. ఆపై చట్టబద్దంగా వివాహం జరిపించేవారు. ఆ తర్వాత అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రూ.2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే, ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను పెళ్లికొడుకుగా నమ్మించి పంపారు. ఏజెంట్ తో సంప్రదింపులు జరపగా.. అనురాధ ఫొటో పంపించాడు. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్.. ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రెయిడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :