Saturday, 17 January 2026 09:19:23 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Narendra Modi: ప్రపంచంలోని ప్రతి డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్ ఉండాలనేది కల: ప్రధాని మోదీ

Date : 11 September 2024 05:35 PM Views : 375

Studio18 News - జాతీయం / : ప్రపంచంలోని ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో భారత్‌లో తయారు చేసిన చిప్‌ ఉండాలనేది తమ ఆకాంక్ష అని, దేశంలోనే 100 శాతం ఎలక్ట్రానిక్‌ తయారీ జరగాలన్నదే తమ కల అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో 'సెమికాన్ ఇండియా 2024'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెమీకండక్టర్ల రంగానికి చెందిన ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. భారత్‌ను సెమీ కండక్టర్ పవర్ హౌస్‌గా మార్చేందుకు చేయాల్సిందంతా చేస్తామన్నారు. దేశంలో ప్రస్తుతం త్రీ డైమెన్షనల్ పవర్ ఉందన్నారు. అనుకూలమైన ప్రభుత్వం, తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, ఆశావహ మార్కెట్... ఈ మూడు భారత్‌లో ఉన్నాయన్నారు. టెక్నాలజీ రుచి ఏమిటో తెలిసిన ఇలాంటి మార్కెట్ మరోచోట దొరకదన్నారు. భారత్‌లో మార్కెట్ అనుకూల వాతావరణం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే సరఫరా గొలుసు అన్నింటికీ ముఖ్యమన్నారు. అలాంటి సరఫరా గొలుసును సృష్టించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. కరోనా సమయంలో ఈ విషయంలో భారత్‌కు ఎదురు దెబ్బలు తగిలాయని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో కనుక పెట్టుబడులు పెడితే 21వ శతాబ్దంలో చిప్స్ కొరత రానే రాదన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి... విలువను సృష్టించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు. చిప్ అంటే కేవలం సాంకేతికతకు మాత్రమే పరిమితం కాదని, కోట్లాదిమంది పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమం అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :