Thursday, 12 March 2026 12:20:47 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

తెలంగాణ జీడీపీతో పోలిస్తే తక్కువ ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది: ఈటల రాజేందర్

Date : 02 June 2025 04:06 PM Views : 352

Studio18 News - జాతీయం / : ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'పెద్దన్న' అంటూ ప్రశంసించి, రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశాయని ఈటల గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బీజేపీ అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందించిందని తెలిపారు. అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించారని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, బీఆర్ఎస్ పార్టీపై నెపం మోపి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ఈటల ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కల్లలు చేశాయని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను గట్టెక్కించడం తమతోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో తాను ఎందుకు కలుస్తానని ప్రశ్నించిన ఈటల, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక్క అవినీతి, అక్రమాలపైనైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అని ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :