Saturday, 07 March 2026 08:01:20 PM
# ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # గజ్వేల్ ఎంఆర్ఓ ఇంటిపై ఏసీబీ దాడులు # జగిత్యాలపై చిన్నచూపు ఎందుకు..?

దేశంలో నక్సలైట్ల శకం ముగిసింది: అమిత్ షా

జగదల్‌పూర్‌లో మాజీ నక్సల్స్‌తో అమిత్ షా సమావేశం 31 మార్చి 2026 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తరిమేస్తామన్న కేంద్రహోం మంత్రి ఏడాది కాలంలో 287

Date : 16 December 2024 11:31 AM Views : 548

Studio18 News - జాతీయం / : దేశంలో నక్సలిజం చివరి అంకంలో ఉందని, మార్చి 2026 నాటికి దానిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని నొక్కి వక్కాణించారు. గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు. ‘నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా’ కలను సాకారం చేయడంలో చత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు.

Also Read : వందసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు... రూపాయి ప్రయోజనం కూడా లేదు: కేటీఆర్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :