Wednesday, 10 December 2025 01:37:44 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

పాక్ సైనికుల కాల్పులకు దెబ్బతిన్న ఇళ్ల గోడలు, కార్లు.. వీడియో ఇదిగో!

Date : 09 May 2025 03:08 PM Views : 238

Studio18 News - జాతీయం / : జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్థులు తీవ్రంగా నష్టపోయారు. పూంచ్, రాజౌరీ, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్‌లో ఒక ఆలయం, గురుద్వారా, మసీదు కూడా ఈ కాల్పుల వల్ల దెబ్బతిన్నాయని వీడియోల్లోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ నిరంతరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత సైన్యం పేర్కొంది. గురువారం రాత్రి పాక్ బలగాలు డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పశ్చిమ సరిహద్దు వెంబడి అనేక దాడులకు ప్రయత్నించాయని, వీటిని భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆర్మీ తెలిపింది. బారాముల్లా జిల్లా లగామా గ్రామానికి చెందిన ఒక నివాసి మాట్లాడుతూ, "మా ఇల్లు దెబ్బతింది. తీవ్ర నష్టం వాటిల్లింది. సర్వం నాశనమైంది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి, "రాత్రంతా మా కుటుంబం మొత్తం ఒకే గదిలో బిక్కుబిక్కుమంటూ గడిపాం. మాకు శాంతి కావాలి" అని అన్నారు. దెబ్బతిన్న ఒక భవనాన్ని స్థానిక యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యగా కూల్చివేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :