Wednesday, 04 March 2026 09:27:02 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సోనియాగాంధీ

Date : 06 January 2026 07:46 PM Views : 154

Studio18 News - జాతీయం / : దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సోనియా సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిక సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. సీనియర్ పల్మోనాలజిస్ట్ (ఊపిరితిత్తుల నిపుణుడు) నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం చాలా ఘోరంగా ఉంది. దీని కారణంగానే ఆమె అనారోగ్యానికి గురైనట్టు వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడ్డారు. గత డిసెంబర్ లో సోనియా 79వ పుట్టినరోజును జరుపుకున్నారు. మరోవైపు, సోనియా ఆసుపత్రిలో చేరారన్న వార్తతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంకోవైపు, సోనియా ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :