Wednesday, 10 December 2025 02:37:16 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ వికసిస్తోంది.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్

Date : 30 May 2025 12:05 PM Views : 234

Studio18 News - జాతీయం / : ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ వికసిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దుర్నీతిని ఎండగట్టేందుకు ఎంపీల బృందం ఇండోనేషియాలో పర్యటిస్తోంది. ఈ బృందంతో పాటు సల్మాన్ ఖుర్షీద్ కూడా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖుర్షీద్ మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 తో కశ్మీర్ ఓ ప్రత్యేకమైన ప్రాంతమనే భావన ఉండేది. భారత్ లో అంతర్భాగంగా ఉన్నట్లు అనిపించేది కాదు. తాము విడిగా ఉన్నామనే అభిప్రాయం అక్కడ చాలామందిలో ఉండేది. అయితే, 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేశాక ఈ భావన తొలగిపోయింది. ఈ నిర్ణయం జమ్మూకశ్మీర్ లో అభివృద్ధికి బాటలు వేస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేశాక అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 65 శాతం ఓట్లు పోలవడమే దీనికి నిదర్శనం’ అని ఖుర్షీద్ అన్నారు. అయితే, గతంలో ఆర్టికల్ 370పై సల్మాన్ ఖుర్షీద్ భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఖుర్షీద్ స్పందిస్తూ.. ఆర్టికల్ 370 అనేది జమ్మూకశ్మీర్ ను భారత్ తో కలిపి ఉంచేందుకు మార్గం చూపిందని అప్పట్లో వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా ప్రశంసలు కురిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుండగా, ఇప్పుడు సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా పరోక్షంగా బీజేపీని మెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :