Monday, 23 June 2025 02:36:01 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Congress: పని ఒత్తిడిపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు... మండిపడిన కాంగ్రెస్

Date : 23 September 2024 03:10 PM Views : 137

Studio18 News - జాతీయం / : విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు పని ఒత్తిడి నిర్వహణ మీద బోధన జరగాల్సి ఉందని, సీఏ చదివిన యువతి పని ఒత్తిడిని భరించలేకపోయిందన్న వార్త తనను కలచివేసిందన్నారు. అయితే నిర్మలా సీతారామన్ ఏ కంపెనీ పేరు, యువతి పేరును ప్రస్తావించలేదు. కానీ ఇటీవల యర్నెస్ట్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు విద్యతో పాటు పని ఒత్తిడిని జయించడం కూడా విద్యా సంస్థలు బోధించాలన్నారు. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న పని పరిస్థితుల గురించి మాట్లాడకుండా... పని ఒత్తిడిని జయించడం గురించి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ పేర్కొంది. కార్పోరేట్లకు ఇబ్బంది వచ్చినప్పుడే ఆర్థికమంత్రి పట్టించుకుంటారని, కార్పోరేట్ శ్రమ దోపిడీకి గురైన అన్నాసెబాస్టియన్ వంటి వారి బాధలు పట్టవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి... ఆమెదే తప్పన్నట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. క్లిష్టమైన కోర్సుల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెన్సీ చేసిన యువతికి పని ఒత్తిడి గురంచి చెప్పాల్సిన అవసరం లేదని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. పని విధానం, సుదీర్ఘ పని గంటలు వంటి అంశాల గురించి ఆర్థికమంత్రి మాట్లాడాలని హితవు పలికారు. సన్నిత అంశాల పట్ల ఆచితూచి మాట్లాడాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :