Monday, 23 June 2025 03:48:00 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

Zakir Naik: మీ కంటే ఇండియన్ హిందూ ఆఫీసర్ నయం.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ ఫైర్..

Date : 08 October 2024 01:15 PM Views : 148

Studio18 News - జాతీయం / : వివాదాస్పద ఇస్లామిక్ మత బోధకుడు డాక్టర్ జకీర్ నాయక్‌కు తత్వం బోధపడింది. పాకిస్థాన్ కంటే భారత్ ఎంతో నయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో పర్యటించిన ఆయన ఆ దేశ ఎయిర్ లైన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు బ్యాగేజీపై చార్జీలను విధించడమే ఆయన మండిపాటుకు కారణం. తన బ్యాగేజీపై 50 శాతం చార్జీలను మాత్రమే తగ్గిస్తామని పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) చెప్పడంతో ఆయన దానిని తిరస్కరించారు. ఈ సందర్భంగా భారత్, పాక్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వెల్లడించారు. భారత్‌లోని ఒక హిందూ అధికారి కూడా బ్యాగేజీని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతిస్తాడని, కానీ మీరు ముస్లిం అయి ఉండి కూడా చార్జీలు వసూలు చేయడం ఏమీ బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను పీఐఏ సీఈవోతో మాట్లాడా. డాక్టర్ సాబ్ మీ కోసం ఏమైనా చేస్తామని చెప్పారు. మేం ఐదారుగురం ప్రయాణిస్తున్నాం, 500 లేదంటే 600 కేజీల అదనపు బ్యాగేజీ ఉంటుందని చెప్పాను. దీంతో ఆయన 50 శాతం చార్జీలు తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నేను.. 100 శాతం డిస్కౌంట్ ఇస్తే ఇవ్వండి. లేదంటే దాని గురించి మర్చిపొమ్మని చెప్పాను. ఇండియాలో ఎవరైనా నన్ను చూస్తే, అతడు ముస్లిం కాకున్నా నన్ను ఉచితంగా పంపేవాడు. 1000, 2 వేల కిలోలున్నా డాక్టర్ సాబ్‌దని ఉచితంగా పంపేవాడు. ఇండియా అంటే అదీ’’ అని వ్యాఖ్యానించారు. పాక్‌లో తన పరిస్థితిపై మాట్లాడుతూ.. ‘‘నేను ఈ దేశానికి అతిథినని వీసా చెబుతోంది. పాక్ ఎయిర్ లైన్స్ మాత్రం 50 శాతం తగ్గింపు అంటోంది. వారు చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ దేశానికి వస్తున్నందుకు నాకు చాలా బాధ అనిపించింది’’ అని జకీర్ నాయక్ ఆక్రోశం వెళ్లగక్కారు. గత కొన్నాళ్లుగా మలేషియాలో ఉంటున్న జకీర్ నాయక్ నెల రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్ కి వచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :