Monday, 23 June 2025 02:13:57 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?

Date : 12 March 2025 04:50 PM Views : 79

Studio18 News - జాతీయం / : భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లాస్టిక్ పాములను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై “పాములా” కూర్చొందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు బుట్టలు, ప్లకార్డులలో ప్లాస్టిక్ పాములను ప్రదర్శించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ సర్కారుకి వ్యతరేకంగ నినాదాలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరుగుతోందని సింఘర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు, విద్య, నీటిపారుదల, ఆరోగ్యం వంటి ప్రభుత్వ శాఖలలో భారీగా ఖాళీలు ఉన్నా.. ఎందుకు నియామకాలు చేపట్టడంలేదని ప్రశ్నిచారు. బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను పాములా కాటువేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలపై పాములా పగబట్టిందని ఆరోపించారు. అందుకే, నిరుద్యోగ సమస్యపై నిద్రావస్తలోని ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఒక్క విద్యా శాఖలోనే 70,000 కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :