Monday, 08 December 2025 03:05:26 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే!

Date : 13 November 2025 07:28 PM Views : 137

Studio18 News - జాతీయం / : ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడ్డ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పుల్వామాలో నివసిస్తున్న తల్లితో సరిపోయిన డీఎన్ఏ సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన ఉగ్రవాది కదలికలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన కారు బాంబు దాడి కేసులో కీలక పురోగతి లభించింది. ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అని దర్యాప్తు సంస్థలు అధికారికంగా నిర్ధారించాయి. కారులో లభించిన మృతదేహం అవశేషాలపై నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో ఈ విషయం స్పష్టమైంది. బుధవారం రాత్రి ఫోరెన్సిక్ బృందాలు ఈ నివేదికను పోలీసులకు అందించాయి. పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 కారు శిథిలాల నుంచి సేకరించిన ఎముకలు, దంతాలు, దుస్తుల నమూనాలతో... పుల్వామాలో నివసిస్తున్న ఉమర్ తల్లి, సోదరుడి డీఎన్ఏ నమూనాలు 100% సరిపోలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉమర్ మొహమ్మద్ పేలుడుకు పాల్పడటానికి కొన్ని నిమిషాల ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఓ మసీదుకు వెళ్లినట్లు తేలింది. టర్క్‌మన్ గేట్ వద్ద ఉన్న ఫైజ్-ఎ-ఇలాహి మసీదుకు వెళ్లి, అక్కడ 10 నిమిషాలకు పైగా గడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయింది. నిజాముద్దీన్ మర్కజ్ తరహాలోనే ఈ మసీదులో కూడా తబ్లిగీ జమాత్ కార్యకలాపాలు జరుగుతాయని సమాచారం. ఈ కొత్త సమాచారంతో అప్రమత్తమైన దర్యాప్తు బృందాలు ప్రస్తుతం ఆ మసీదుపై నిఘా పెట్టాయి. ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేసే వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ఉమర్ కీలక సభ్యుడని పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. దాడికి ఉపయోగించిన తెల్లటి ఐ20 కారును అతడే 11 రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు కూడా గుర్తించారు. తాజాగా డీఎన్ఏ నివేదికతో ఉమరే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని నిర్ధారణ కావడంతో, ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న మిగతా వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :